This Portal is Connected to Production Database.

Telugu Language Pack
Thumbnail Image of శ్రీచైతన్యచరితామృతము మధ్యలీల, ఐదవ  భాగము

శ్రీచైతన్యచరితామృతము మధ్యలీల, ఐదవ భాగము (Shri Chaitanya Charitamritamu Madhyalila Iidava Bhagamu)

Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు

Description

శ్రీచైతన్యచరితామృతము శ్రీకృష్ణచైతన్య మహాప్రభువు జీవితము, బోధల గురించి తెలిపే ప్రామాణికమైన గ్రంథము. పరమ భక్తుడు, ఆధ్యాత్మికాచార్యుడు, పరమయోగి, భగవదవతారము అయినట్టి శ్రీచైతన్యమహాప్రభువు భారతదేశములో పదహారవ శత్దామునందు ఒక గొప్ప సాంఘిక, ఆధ్యాత్మిక ఉద్యమాన్ని నడిపారు. మహన్నతమైన తాత్త్విక, ఆధ్యాత్మిక సత్యాలతో కూడినట్టి ఆయన బోధలు ఇప్పటివరకు అసంఖ్యాకమైన తాత్త్వికులను, ధార్మికులను ప్రభావితము చేసాయి. కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు (పైన పటము) ఈ గ్రంథములోని మూల బెంగాలీ శ్లోకాలకు అర్థమును, వ్యాఖ్యానమును వ్రాసారు. శ్రీల ప్రభుపాదులు విశుద్ధ కృష్ణభక్తులు, పరమ ప్రఖ్యాతి చెందిన పండితులు, భారతీయ తత్త్వసంస్కృతులకు ఆచార్యులు, విస్తృతముగా చదువబడే భగవద్గీత యథాతథము గ్రంథానికి, ప్దనిమిది సంపుటాల వ్యాసభాగవతానికి రచయిత అయియున్నారు. శ్రీచైతన్యచరితామృత గ్రంథము ప్రస్తుత మానవుని బుద్ధికుశలతకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక జీవనానికి అత్యంత ప్రధానమైన వరదానము అవుతుంది.

Sample Audio

Copyright © 1972, 2022 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032)