భగవద్గీత యథాతథము (సరళభాషాగ్రంథము) (Bhagavad Gita - Yathathathamu Sarala Bhasha Granthamu)
Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
Description
భగవద్గీత భారతదేశపు ఆధ్యాత్మిక జ్ఞానరత్నముగా విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేవదేవుడైన శ్రీకృష్ణభగవానునిచే తన ఆంతరంగిక భక్తుడైన అర్జునునికి చెప్పబడిన గీతలోని సంగ్రహమైన ఏడువందల శ్లోకాలు ఆత్మసాక్షాత్కార విజ్ఞానానికి నిశ్చయమైన ఉపదేశాన్ని అందిస్తాయి. నిజానికి మనిషి యొక్క ప్రధానమైన స్వభావము, అతని చుట్టు ఉండే పరిసరాలు, అతనికి భగవంతునితో ఉన్న సంబంధమును తెలియజేయడంలో ఏ గ్రంథమైనా దీనితో సరిపోలదు. ప్రపంచములో అత్యంత ముఖ్యమైన వేదవిద్వాంసులు, ఆచార్యులు అయిన కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు సాక్షాత్తుగా శ్రీకృష్ణుని నుండే ప్రారంభమైనట్టి అఖండిత పూర్ణ ఆత్మానుభవ గురుపరంపరకు ప్రాతినిథ్యము వహిస్తున్నారు. ఆ విధంగా ఇతర గీతాగ్రంథాలకు భిన్నంగా ఆయన గ్రంథము శ్రీకృష్ణభగవానుని గొప్ప సందేశమును కించిత్తైనా స్వార్థపూరిత మార్పు లేకుండ యథాతథంగా అందజేస్తున్నది.
Sample Audio