శ్రీమద్భాగవతము ప్రథమ స్కంధము (Shrimad Bhagavatam Prathama Scandamu)
Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
Description
తత్త్వపూర్ణము, సాహిత్యపూర్ణము అగు శ్రీమద్భాగవతము భారతదేశమునకు చెందిన విస్తారమగు వాఙ్మయములో ప్రముఖ స్థానమును అలంకరించియున్నది. భారతదేశపు కాలాతీతజ్ఞానము వేదములలో తెలుపబడినది. సంస్కృతభాషలో లిఖించబడిన అట్టి వేదములు మానవవిజ్ఞానానికి చెందిన అన్ని రంగములతో సంబంధములను కలిగియున్నవి. ఆదిలో శ్రవణవిధానము ద్వారా భద్రపరుపబడిన ఆ వేదములు తొలిసారిగా గ్రంథకర్త అవతారమైన శ్రీల వ్యాసదేవునిచే గ్రంథస్థము కావించబడినవి. వేదరచనము పిమ్మట శ్రీల వ్యాసదేవుడు తన గురుదేవుని ప్రేరణ చేత వాటి సారమును శ్రీమద్భాగవతముగా రచించినాడు. వేదతరువుకు పండిన ఫలముగా తెలియబడెడి ఈ శ్రీమద్భాగవతము వేదజ్ఞానమునకు పరమపూర్ణమును, ప్రామాణికమును అగు వివరణమై యున్నది. దివ్యమైన గోలోకబృందావనము చేరుటకు శ్రీమద్భాగవతము మనకు సహాయము చేయగలదు. ఆ ద్వారము సర్వుల కొరకు తెరువబడియున్నది. మహోన్నతమగు పరిపూర్ణత్వమైనట్టి ఆ ప్రత్యేకమగు లక్ష్యసాధనకే మానవజీవితము ఉద్దేశింపబడినది.
Sample Audio